SRPT: కోదాడ ఆర్టీసీ డిపో అభివృద్ధికి విశ్రాంత ఉద్యోగులు సహకరించాలని డిపో మేనేజర్ శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం సాయంత్రం డిపోలో నూతనంగా ఎన్నికైన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులను అభినందిస్తూ, వారి అనుభవం డిపో అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రీజియన్ కమిటీ సభ్యుడు శంకరయ్య, డిపో కమిటీ సభ్యులు రత్నం, పాల్గొన్నారు.