నైజీరియాలో 52 మంది బడి పిల్లలను సాయుధ దుండగులు అపహరించారు. ఈ విషయాన్ని నైజర్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి అబూబకర్ ఉస్మాన్ వెల్లడించారు. నైజీరియాలో క్రైస్తవులకు వ్యతిరేకంగా సాగుతున్న మారణహోమాన్ని నిలిపేందుకు సైనిక చర్యకు వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ అపహరణలు కలకలం రేపుతున్నాయి.