AP: రాజధాని ప్రాంత రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ రోజు ఉ.9 గంటలకు సీఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ కీలక సమీక్ష నిర్వహించనుంది. ఈ కమిటీలో మంత్రులు నారాయణ, పెమ్మసాని చంద్రశేఖర్, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పాల్గొంటారు. రైతులు లేవనెత్తిన అంశాలపై ఈ సమీక్షలో పరిష్కార మార్గాలు చూపనున్నారు. కాగా, ఇటీవల రైతు జేఏసీ ప్రతినిధులతో కమిషనర్ చర్చించారు.