HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని మెట్టుగుట్టపై కొలువుదీరిన స్వయంభు శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి వారికి శనివారం 108 కిలోల అన్నంతో అన్నాభిషేకమును అర్చకులు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తీసుకువచ్చిన అన్నంతో అర్చకులు రాగి చెడు అభిలాష్ శర్మ స్వామివారిని ప్రత్యేకంగా అభిషేకించి భక్తులకు దర్శనమును కల్పించారు.