TG: డెడికేటెడ్ కమిషన్ నివేదికకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం మించకుండా రిజర్వేషన్లు ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లపై ప్రభుత్వం నేడు జీవో విడుదల చేయనుంది.