GDWL: ప్రజాకవి, గాయకుడు అందెశ్రీ సంస్మరణ సభను జయప్రదం చేయాలని అయిజ అఖిలపక్ష కమిటీ నాయకులు వెంకట్రాములు, ఆంజనేయులు, పల్లయ్య కోరారు. శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించిన సందర్భంగా తెలంగాణ గొప్పతనాన్ని చెప్పే జయ జయహే తెలంగాణ గీత రచయితను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. ఈనెల 30న అయిజలో నిర్వహించే ఈ సభకు ప్రజలు తరలిరావలన్నారు.