KRNL: రాయలసీమ వర్సిటీ పరిధిలోని డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షలు మొదలైనట్లు VC వెంకటబసవరావు పేర్కొన్నారు. నిన్న సెయింట్ జోసెఫ్ మహిళా డిగ్రీ కళాశాల, శంకరాస్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాలను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్లు, VC పరిశీలించారు. మొదటి రోజు 3వ సెమిస్టర్ పరీక్షకు 9,463 మందికి, 8,611 మంది హాజరు కాగా, 8 మంది కాపీ చేస్తూ పట్టుబడ్డారు. వారిని డిబార్ చేసినట్లు తెలిపారు.