MDCL: కోట్ల రూపాయిల మోసం కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఉప్పల సతీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉప్పల సతీష్ కోసం నెల నుంచి గాలిస్తున్న పోలీసులు.. ఎట్టకేలకు ముంబైలో అరెస్ట్ చేశారు. రూ. 23 కోట్ల రూపాయిల మోసం కేసులో ఉప్పల సతీష్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ప్రముఖుల నుంచి డబ్బులు వసూలుచేసి వారిని మోసం చేసినట్లు సతీష్‌పై అభియోగాలున్నాయి.