WNP: జిల్లా కేంద్రంలో నేడు ‘సదర్ సయ్యాట’ సమ్మేళనం నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు ఎర్వ సాయి యాదవ్ తెలిపారు. శనివారం సాయంత్రం పాతకోట శ్రీకృష్ణ దేవాలయం నుంచి దున్నపోతుల ఊరేగింపు ప్రారంభమై రాజాగారి బంగ్లా (పాలిటెక్నిక్) మైదానానికి చేరుకుంటుందని చెప్పారు. యాదవులు, యువకులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఆయన తెలిపారు.