TG: జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత BRSకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. కొన్ని రాష్ట్రాల్లో 99 పైసలకే భూములు ఇస్తున్నారన్నారని.. తాము కూడా పెట్టుబడి దారులకు తక్కువ ధరకే భూములు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. పెట్టుబడులు రావాలి అనేది తమ లక్ష్యమన్నారు. ఫ్రీ హోల్డ్ ల్యాండ్ ఉన్నవారు తాము తీసుకొచ్చిన పాలసీ ద్వారా దరఖాస్తు చేసుకుంటారన్నారు.