TG: పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వ భూములను తక్కువ ధరకు ఇస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. 2023లో BRS మూడు జీవోలు ఇచ్చిందన్నారు. ఆ జీవో ప్రకారమే తమ ప్రభుత్వం భూముల ట్రాన్స్ ఫర్కు అనుమతి ఇచ్చిందన్నారు. పరిశ్రమలు పెట్టేవాళ్లు 6నెలలలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఫ్రీ హోల్డ్, ల్యాండ్ లీజ్‌కు తేడా లేకుండా KTR మాట్లాడారన్నారు.