KMR: పాల్వంచ మండలం భవానిపేటలో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఓ ఇల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన రేణుక తన ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగా, మీటర్ వద్ద పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో, విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న పలు వస్తువులు కాలిపోయి నష్టం వాటిల్లింది.