GNTR: ఉభయ రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతకు 50పైన కంపెనీల ద్వారా 1000 ఉద్యోగాల పైన ఉపాధి కల్పించనున్నారని APMSIDC ఛైర్మన్ శ్రీనివాసరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో డిసెంబర్ 13న గుంటూరు హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం మంగళగిరి ఆటోనగర్‌లోని కార్యాలయంలో గోడప్రతులను ఆవిష్కరించారు.