ASF: సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతితో కలిసి జూమ్ మీటింగ్ ద్వారా తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్సైలతో సమావేశమయ్యారు. తక్షణమే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాను అందించాలని ఆదేశించారు.