MBNR: ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల సాకారం అవుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ రూరల్ మండలం పోతనపల్లి కోటకద్ర గ్రామాలలో నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజమైన అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామన్నారు.