AP: ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా గంగపుత్రులకు మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘సముద్రాన్ని జీవనాధారంగా చేసుకుని, ఎగసిపడుతున్న కెరటాలతో నిత్యం పోరాటం చేస్తూ నా గంగపుత్రులు జీవనం సాగిస్తారు. మన ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల ద్వారా మత్స్యకారులకు రూ.4,913 కోట్లు లబ్ధి చేకూర్చాం. మత్స్యకారులకు YCP అండగా ఉంటుంది’ అని హామీ ఇచ్చారు.