ELR: ఏలూరు అమీనాపేటలోని పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని, విద్యార్ధులకు నేత్ర సంరక్షణ వైద్య శిబిరాన్ని ఏలూరు రేంజ్ ఐజీ శుక్రవారం ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే కంటిచూపుపై దృష్టి పెట్టి తగిన జాగ్రత్తలు వహించాలని తల్లిదండ్రులకు ఆయన సూచించారు. కంటి చూపుకు అత్యధిక ప్రాధాన్యత ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ, ఏఎస్పీలు పాల్గొన్నారు.