KMM: ఏన్కూరు మండలంలో ఆర్టీసీ సిబ్బంది రిక్వెస్ట్ బస్టాపుల్లో బస్సులు ఆపడం లేదని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ కళాశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఎమ్మార్వో కార్యాలయం వద్దా బస్సు ఆపమని అడిగితే వాగ్వాదానికి దిగుతున్నారని తెలిపారు.