W.G: ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడం కోసమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శుక్రవారం భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి 7 అర్జీలను స్వీకరించారు. ప్రతి నెల మొదట శుక్రవారం, మూడో శుక్రవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని పేర్కొన్నారు.