ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీశ్ మహబూబాబాద్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గతంలో ములుగు అడిషనల్ ఎస్పీగా పని చేసిన సుధీర్ రాంనాథ్ కేకన్ను జిల్లా ఎస్పీగా కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో ములుగులో పనిచేసిన అనుభవం నేపథ్యంలో ఆయనను జిల్లాకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించింది.