NZB: మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపకేంద్రం ఏర్పాటుతో మంచిప్పతో పాటు చుట్టుపక్కల ఉన్న తండాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని, ఇది సంతోషకరమన్నారు.