పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 172 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన ఆసీస్ 39 ఓవర్లలో 123/9 గా ఉంది. ఆసీస్ జట్టు ఇప్పటికీ 49 పరుగుల వెనకంజలో ఉంది. అంతకముందు బౌలింగ్లో ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ 7 వికెట్లు పడగొట్టాడు.