KDP: పొద్దుటూరు పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 10.56 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ బెట్టింగ్ ముఠాలో కీలక వ్యక్తులైన లింగాపురానికి చెందిన ధనికల వీరశంకర్, కాశినాయన మండలానికి చెందిన ఆర్ల చంద్ర యాదవ్‌ను శుక్రవారం డీఎస్పీ భావన ఆధ్వర్యంలో సీఐ సదాశివయ్య అరెస్టు చేసి,నగదు స్వాధీనం చేసుకున్నారు.