ADB: విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగం వైపు పయనించాలని మండల విద్యాశాఖ అధికారి రాధాకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం భీంపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సైన్స్ పరిజ్ఞానంపై చెకుముకి పరీక్షను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రతి అంశంపై లోతైన పరిజ్ఞానాన్ని అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పేర్కొన్నారు.