WGL: జిల్లా కలెక్టర్ డా. సత్యశారదదేవిని MLC బస్వరాజు సారయ్య, 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్‌లు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. దక్షిణ భారతదేశంలో జల సంరక్షణ కేటగిరీ-2లో తొలిస్థానం సాధించిన సందర్భంగా కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు. డిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అవార్డు, రూ. కోటి బహుమతిని స్వీకరించిన విషయం తెలిసిందే.