GNTR: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం తప్పకుండా కొనుగోలు చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. శుక్రవారం తాడేపల్లి మండలంలోని పాతూరు, చిర్రావూరు గ్రామాల్లో మంత్రి పర్యటించారు. చిర్రావూరు రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మంత్రి, రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.