WG: కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడంతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని వైసీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇంఛార్జ్ గుడాల గోపీ అన్నారు. శుక్రవారం అబ్బిరాజుపాలెంలో వైసీపీ కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గ్రామస్థులతో సంతకాల సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ యడ్ల తాతాజీ పాల్గొన్నారు