ATP: అనంతపురంలోని డా. బీఆర్ అంబేద్కర్ ఫ్లై ఓవర్పై కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డ బాషా, ఇబ్రహీంలను వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పరామర్శించారు. సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితుల మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.