TG: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఏరోస్పేస్ భూ నిర్వాసితులతో కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. భూ సేకరణ జరిగి 8 ఏళ్లు గడుస్తున్నా.. రైతులకు న్యాయం జరగలేదని ఆమె మండిపడ్డారు. కనీసం ఇక్కడ కంపెనీలు పెట్టినా.. స్థానికులకు ఉద్యోగాలు వచ్చేవని అన్నారు. ప్రస్తుతం భూముల రేట్లను దృష్టిలో ఉంచుకుని వారికి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.