ADB: జిల్లా మండల కేంద్రంలోని టాక్లి గ్రామానికి చెందిన పలువురికి కళ్యాణ లక్ష్మి చెక్కులను తహసీల్దార్ రఘునాథరావు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ జిల్లా ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.