TG: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి రివేంజ్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఫార్ములా-ఈ కారు రేసు కేసులో కేటీఆర్ నిబంధనలను ఉల్లంఘించారని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు.