JGL: మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో 69వ SGF గేమ్స్ 2025 జిల్లా స్థాయి ఖోఖో టోర్నమెంట్ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలు మనలో క్రమశిక్షణను, పోరాట పటిమను, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయన్నారు.