MBNR: మత్స్యకారుల ఐక్యతతో తమకు రావాల్సిన హక్కులను సాధిస్తామని తెలంగాణ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు గంజి ఆంజనేయులు అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని తిమ్మసన్పల్లిలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మత్స్య కార్మికుల జెండాను ఆవిష్కరించి అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.