TG: దుబాయ్లో సిద్దిపేట జిల్లా వాసి మృతి చెందాడు. హుస్నాబాద్ మండలం మడద గ్రామానికి చెందిన జేరిపోతుల వెంకటస్వామి (46) అబుదాబిలో 5 రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయాడు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. కాగా, 2 నెలల క్రితం ఉపాధి నిమిత్తం అబుదాబికి వెంకటస్వామి వెళ్ళాడు.