HYD: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడే అవకాశముందనే చర్చ నడుస్తోంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే తన పార్టీ మార్పుపై దానం ఇంతవరకు స్పీకర్‌కు సమాధానం ఇవ్వలేదు. అదే జరిగితే ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక ఖాయమైనట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.