వరంగల్లో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా ఎన్జీవోలు నిర్వహించిన వాకథాన్కు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శ్రీకారం చుట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. భయాన్ని వీడి ప్రశ్నించడం నేర్చుకోవాలని ఆమె బాలలకు సూచించారు. అత్యవసర సహాయం కోసం 1098 హెల్ప్ లైన్ వినియోగించాలని అదనపు కలెక్టర్ సంధ్యా రాణి కోరారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.