TG: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 50 శాతం మించకుండా పంచాయతీలు, వార్డుల వారీగా రిజర్వేషన్లను కమిషన్ సిఫారసు చేసింది. దీని ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. ఈనెల 24న హైకోర్టు విచారణకు ముందే ఈ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనుంది. ఈ క్రమంలో ఈనెల 24 లేదా 25న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు సమాచారం.