ADB: ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో ఉంటున్న ఆదివాసీలకు భారత రాజ్యాంగం ప్రకారం అన్ని హక్కులు కల్పించాలని ఆదివాసీ విద్యార్ధి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందోర్ సంతోష్ అన్నారు. గురువారం గాదిగూడ మండల కేంద్రంలో ఆదివాసీ పెద్దలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ‘ధర్మ యుద్ధ సభ’ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆత్రం నాగోరావ్ పటేల్, దవలతరావు పాల్గొన్నారు.