WNP: పెద్దమందడి మండలం అల్వాల్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం పొలంలో మేతకు వెళ్లిన కొత్తగోళ్ళ రాముల యాదవ్‌కి చెందిన ఎద్దు ట్రాన్స్ ఫార్మర్ పక్కన ఉన్న 11 కెవి విద్యుత్ తీగ తగిలి మృతి చెందింది. ఘటనా స్థలాన్ని విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే పరిశీలించారు. రైతుకు తగిన పరిహారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.