NGKL: జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్, విజిలెన్స్ కమిటీ సభ్యులు జిల్లెల్ల రాములు గురువారం కలెక్టర్‌ను కలిశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.