AP: రాష్ట్రం నుంచి శబరిమలకు వెళ్తున్న యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. కేరళలోని మావత్తుపుళ సమీపంలోని త్రికలత్తూర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది భక్తులు గాయపడినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో ఆ బస్సులో 33 మంది ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను అలువాలోని ఓ ఆసుపత్రికి తరలించారు.