KRNL: గూడూరు మండలం పెంచికలపాడు సమీపంలోని మంజీత్ కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ & ప్రెసింగ్ యూనిట్లో సీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఏ.సిరి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పత్తి సేకరణ, కొలతలు, రేట్లపై సమాచారం తీసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.