AP: రెండ్రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల చేరుకున్నారు. శ్రీపద్మావతి విశ్రాంతి గృహం వద్ద టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, హోంమంత్రి అనిత, బోర్డు సభ్యులు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి.. రాష్ట్రపతికి స్వాగతం పలికారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు.