అన్నమయ్య: నేడు రైల్వే కోడూరులో ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు నియోజకవర్గ TDP ఇంఛార్జి ముక్కా రూపానంద రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు కోడూరులోని టీడీపీ కార్యాలయంలో ప్రజల అర్జీలను స్వీకరిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.