CTR: పిల్లల భవిష్యత్తును తల్లిదండ్రులు ఉపాధ్యాయుల చేతుల్లో పెట్టారని, వారిని భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత గురువులపై ఉందని భువనేశ్వరి పేర్కొన్నారు. కుప్పం నుంచి మెగా డీఎస్సీకి ఎంపికైన టీచర్లతో ఆమె భేటీ అయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన కోచింగ్ ద్వారా 20 మంది డీఎస్సీకి ఎంపిక కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.