NZB: రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చా తప్పక పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని NZB కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి నోడల్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికలను సాఫీగా నిర్వహించాలని సూచించారు.