GDWL: మానవపాడులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నెలకొన్న అపరిశుభ్రతపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలోని మరుగుదొడ్ల దారిలో, ఆవరణ మొత్తం మురికి నీరు నిలిచిపోవడంతో దోమలు పెరిగి విద్యార్థులు అనారోగ్యాల బారిన పడే పరిస్థితి ఏర్పడింది.సుమారు 500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.