KDP: బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రొద్దుటూరు విద్యార్థి రజతం సాధించాడు. వైవీయూ ఆధ్వర్యంలో బద్వేల్లో బుధవారం బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ సింగిల్స్ పోటీలలో ప్రొద్దుటూరు డిగ్రీ కళాశాల విద్యార్థి పి. భరత్ రాజేశ్ రెండో స్థానం సాధించాడు. రన్నర్‌గా నిలిచిన రాజేశ్‌కు రజత పతకం, సర్టిఫికేట్, నగదు బహుమతి లభించాయి.