CTR: రామకుప్పం (M) ననియాల పచ్చార్ల మాకులపల్లి గ్రామ పరిసరాల్లో ఏనుగు దాడులతో రైతులు హడలిపోతున్నారు. 4 రోజులుగా నిత్యం అటవీ ప్రాంతం నుంచి జంట ఏనుగులు ఆహారం కోసం వచ్చి అందిన కాడికి తిని తొక్కి నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రధానంగా వరి, రాగి పంటలు ఏనుగు దాడులతో ధ్వంసం అవుతున్నాయి. జంట ఏనుగుల దాడులను అరికట్టాలని రైతులు కోరారు.