MBNR: కూతురు కులం కాని వ్యక్తిని ప్రేమించిందని తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన నవాబుపేట మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై విక్రం తెలిపిన వివరాల ప్రకారం.. హనుమసాని పల్లికి చెందిన ఎల్లయ్య కూతురు అరుణ మండల కేంద్రానికి చెందిన యువకుడితో వెళ్లిపోయింది. మనస్థాపం చెందిన ఎల్లయ్య గ్రామ శివారులలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.